తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే వచ్చా: ప్రధాని మోదీ
- సికింద్రాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప సభ
- హాజరైన ప్రధాని మోదీ
- రాజకీయ విమర్శల జోలికి వెళ్లని మోదీ
- తెలంగాణ అభివృద్ధిపైనే వ్యాఖ్యలు
రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల నిధులతో ఐదు భారీ ప్రాజెక్టులు చేపట్టామని, తమ హయాంలో తెలంగాణలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని వివరించారు. హైదరాబాదులో అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని, నగరం చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు.
తమ పాలనలో గ్రామీణ యువతను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ రైతాంగానికి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పంటల కనీస మద్దతు ధర పెంచామని స్పష్టం చేశారు. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, తన ప్రసంగంలో ప్రధాని మోదీ ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. తెలంగాణ అభివృద్ధిపైనే స్పందించారు.