కఠారి దంపతుల హత్య కేసు విచారణ నుంచి తప్పుకుంటానన్న ఏపీపీ... కుదరదన్న చిత్తూరు కోర్టు
- చిత్తూరులో కఠారి మోహన్ దంపతుల హత్య
- కేసుపై చిత్తూరు కోర్టులో కొనసాగుతున్న విచారణ
- ఇటీవలే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన కఠారి మోహన్ కోడలు
- విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో ఏపీపీ పిటిషన్
చిత్తూరు నగరంలో టీడీపీలో కీలక నేతగా ఎదిగిన కఠారి మోహన్... 2013లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీని విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో మోహన్ భార్య అనురాధ చిత్తూరు మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికే పలువురితో వర్గ పోరును సాగిస్తున్న మోహన్‌పై దాడికి పక్కా ప్లాన్ వేసిన ప్రత్యర్థులు మోహన్‌తో పాటు అనురాధను మేయర్ చాంబర్‌లోనే హత్య చేశారు. ఈ హత్యలో కఠారి మోహన్ అల్లుడు చింటూ రాయల్ ప్రత్యక్షంగా పాలుపంచుకోవడం గమనార్హం.
ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలే తిరుపతి వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కఠారి మోహన్ కోడలు కలిశారు. కేసు విచారణ త్వరితగతిన ముగిసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె సీజేఐని కోరారు. ఈ క్రమంలో కేసు విచారణలో ఒకింత వేగం కనిపించగా... ఈ కేసు విచారణ నుంచి తనను తప్పించాలంటూ ఏపీపీ పిటిషన్ వేయడం గమనార్హం.