దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. లక్ష దాటిన యాక్టివ్ కేసులు
- గత 24 గంటల్లో 18,819 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 13,827
- ఇప్పటి వరకు 5,25,116 మంది మృతి
ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,52,164కి పెరిగింది. వీరిలో 4,28,22,493 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 5,25,116 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.16 శాతంగా, రికవరీ రేటు 98.55 శాతంగా, క్రియాశీల రేటు 0.24 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,97,61,91,554 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,17,217 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.