తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona media bulletin
  • గత 24 గంటల్లో 25,989 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 258 కొత్త కేసులు
  • రంగారెడ్డి జిల్లాలో 107 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 279 మంది
  • ఇంకా 3,960 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 25,989 శాంపిల్స్ పరీక్షించగా, 477 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 258 కొత్త కేసులు నమోదయ్యాయి. 

అటు, రంగారెడ్డి జిల్లాలోనూ 100కి పైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజు వ్యవధిలో 107 కేసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,99,532 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,91,461 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,960 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Uodate
Media Bulletin

More Telugu News