ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మకు కరోనా
- యాంటిజెన్ పరీక్షల్లో కరోనా నిర్ధారణ
- క్వారంటైన్‌లోకి వెళ్లిపోయిన రోహిత్
- వామప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడడంతో ఇరు జట్ల ఆటగాళ్లలోనూ కలవరం
ఐదు టెస్టుల సిరీస్ కోసం గతేడాది భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాలుగు టెస్టులు పూర్తికాగా, భారత్ రెండు టెస్టుల్లో విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టుకు ముందు భారత ఆటగాళ్లు కరోనా బారినపడడంతో ఆ మ్యాచ్ వాయిదా పడింది. దానిని ఈ ఏడాది జులై 1కి రీషెడ్యూల్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే టెస్టుకు ముందు రోహిత్ కరోనా బారినపడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ టెస్టు తర్వాత టీ20, వన్డే సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.