కోలీవుడ్ బాట పట్టిన నాగ చైతన్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలీవుడ్ బాట పట్టిన నాగ చైతన్య

NagaChaitanya enters into Tamil cinema
  • వెంకట్ ప్రభు దర్శకత్వంలో కొత్త సినిమా
  • తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం
  • హీరోయిన్ గా కృతి శెట్టి
అక్కినేని నాగచైతన్య తన రూటు మార్చాడు. ఇప్పటికే ‘లాల్‌సింగ్ చద్ధా’ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న చైతన్య ఇప్పుడు కోలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాడు. పదమూడేళ్ల కెరీర్‌‌లో ఇరవైకి పైగా తెలుగు సినిమాల్లో నటించిన నాగచైతన్య తన మార్కెట్ పరిధిని ఇతర భాషల్లో కూడా పెంచుకునే పనిలో ఉన్నాడు. 
   
 తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో చైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తమిళ్ లో చైతన్యకు ఇదే తొలి చిత్రం కాగా.. వెంకట్ ప్రభుకు మొదటి తెలుగు సినిమా. ‘బంగార్రాజు’లో నాగ చైతన్యకు జోడీగా కనిపించి ఆకట్టుకున్న యువ నటి కృతి శెట్టి ఈ సినిమాలో మరోసారి అక్కినేని వారసుడితో కలిసి నటిస్తోంది. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి యువన్‌ శంకర్‌‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. 

ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం జరిగింది. హీరో హీరోయిన్లపై ముహూర్తపు షాట్‌ తీశారు. తెలుగు వెర్షన్‌కి బోయ‌పాటి, తమిళ వెర్షన్‌కు భారతీరాజా క్లాప్ కొట్టారు. రానా, శివకార్తికేయన్‌లు కెమెరా ఆన్ చేశారు. కాగా, నాగచైతన్య కొత్త చిత్రం ‘థాంక్యూ’ వచ్చే నెలలో విడుదల కానుంది. ‘లాల్‌సింగ్ చద్ధా’ ఆగస్టులో వస్తుంది. ప్రస్తుతం చైతన్య ‘దూత’ అనే అమెజాన్ వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్నాడు.
Naga Chaitanya
Tollywood
Kollywood
vikram prabhu
Krithi Shetty
Rana Daggubati
Boyapati Sreenu

More Telugu News