వరుణుడి దెబ్బకు బెంగళూరు టీ20 రద్దు

Bengaluru T20 abandoned due to rain
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు నిరాశాజనక ముగింపు లభించింది. నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టీమిండియా 3.3 ఓవర్లలో 2 వికెట్లకు 28 పరుగులు చేసిన దశలో మొదలైన వర్షం చాలాసేపు కొనసాగింది. దాంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం జలమయమైంది. ఓవర్లు తగ్గించి అయినా మ్యాచ్ జరిపే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్ లో చెరో రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. 

బెంగళూరు మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడడంతో, తీవ్రంగా శ్రమించి మైదానాన్ని సిద్ధం చేశారు. అయితే, మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే మళ్లీ వర్షం పడడంతో ఆటగాళ్లు, అంపైర్లు మైదానాన్ని వీడారు.
Go Back to Shorts
Bengaluru
T20
Rain
Team India
South Africa

More Telugu News