Telangana: తెలంగాణలో 2 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

Corona active cases in Telangana crosses 2 thousand mark
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,026 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 19,715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 180 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. 

అదే సమయంలో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,96,055 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,89,918 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Active Cases
Update

More Telugu News