సికింద్రాబాద్ స్టేషన్ లో ఆందోళనకారులపై కాల్పులు...ఒకరి మృతి!
- అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో ఆందోళన
- రైళ్లను తగులబెట్టిన ఆందోళనకారులు
- కాల్పులు జరిపిన పోలీసులు
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో... ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగింది. ఈ యువకుడిని పోలీసులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఆందోళనల్లో 11 మంది యువకులు గాయపడ్డారు. వీరందరికీ గాంధీలో చికిత్స అందిస్తున్నారు.