అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర!
- అనుష్కకు ఇద్దరు సోదరులు
- ఒక సోదరుడు గుణరంజన్ శెట్టి గ్యాంగ్ స్టర్
- గుణరంజన్ హత్యకు స్కెచ్ వేసిన మరో గ్యాంగ్ స్టర్
గుణరంజన్ మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హత్య చేసేందుకు మన్విత్ రై కుట్ర పన్నినట్టు సమాచారం. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్ తనకు భద్రత కల్పించాలని కోరారు.
అనుష్కకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరు గుణరంజన్ షెట్టి, రమేశ్ షెట్టి. అనుష్క సోదరుడి హత్యకు స్కెచ్ వేసినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.