దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. 45 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 8,582 మందికి కరోనా పాజిటివ్
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,513
- 2.71 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,32,22,017కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,24,761 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరుకుంది. రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది. క్రియాశీల రేటు 0.10 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 194.9 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.