తిరుమలలో అనూహ్య రద్దీ... సర్వ దర్శనానికి 20 గంటలు
- శనివారం సాయంత్రానికి నిండిన తిరుమల
- ఇప్పటికే నిండిపోయిన సర్వ దర్శనం క్యూ కాంప్లెక్స్
- క్యూ కాంప్లెక్స్ బయట 2 కిలో మీటర్ల మేర వేచి ఉన్న భక్తులు
విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటం, వారాంతం కావడంతో శనివారం మధ్యాహ్నం నుంచే భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోయిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది భక్తులు వచ్చినా...వారందరికీ స్వామి వారి దర్శనాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం, నీరు, పాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.