సత్యం కుంభకోణం: రామలింగరాజు తల్లికి హైకోర్టులో ఊరట
- కుంభకోణంలో రామలింగరాజు తల్లి కూడా లబ్ధిదారేనన్న సీబీఐ
- లావాదేవీలన్నీ ఆమె బ్యాంకు ఖాతా ద్వారానే జరిగాయని అభియోగాలు
- ఆమె బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్
- ఖాతాను పునరుద్ధరించాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు
తాను వృద్ధురాలినని, తన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వల్ల జీవనభృతి కోసం దాచుకున్న సొమ్ము అందులో చిక్కుకుపోయిందని, కాబట్టి జీవనం కష్టంగా ఉందని పేర్కొన్నారు. తన ఖాతాల్లో ఉన్న సొమ్మును వినియోగించుకునేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారించిన జస్టిస్ రాధారాణి నేతృత్వంలోని ధర్మాసనం ఆమెకు ఊరట కలిగేలా తీర్పు ఇచ్చింది. కరూర్ వైశ్యాబ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇతర బ్యాంకుల్లో ఆమెకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను, బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.