Mystery Creature: టెక్సాస్ జూ వెలుపల వింత ఆకారం దర్శనం... దర్యాప్తు చేస్తున్న అధికారులు

  • టెక్సాస్ లోని అమారిల్లో జూ వద్ద ఘటన
  • జూ ఫెన్సింగ్ వద్దకు వచ్చిన వింత ఆకారం
  • జూ కెమెరాలో రికార్డయిన వైనం
Mysterious creature spotted outside Texaas Zoo

అమెరికాలోని టెక్సాస్ లో ఓ జూ వెలుపల వింత ఆకారం కలకలం రేపింది. ఇక్కడి అమారిల్లో జంతు ప్రదర్శనశాల వద్ద ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీ కెమెరాలో ఈ వింత ఆకారం దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై జూ అధికారులు దర్యాప్తు కూడా చేపట్టారు. రెండు కాళ్లతో ఉన్న ఈ ఆకారం తల జంతువును పోలి ఉంది. 

గత నెల 21న కెమెరాలో రికార్డయిన ఈ వింత జీవిని చూసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీని ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, భిన్న స్పందనలు వచ్చాయి. మనిషే జంతువు వేషం వేసుకుని వచ్చి ఉంటాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇది వింత జీవి అయ్యుంటుందేమోనని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విచిత్ర జీవిని గుర్తించడంలో సాయపడాలంటూ అధికారులు స్థానిక ప్రజలను కోరుతున్నారు.

More Telugu News