రియల్ మీ నార్జో 50 ప్రో అమ్మకాలు నేటి నుంచే.. రూ.2,000 డిస్కౌంట్
- రెండు వేరియంట్లతో అందుబాటులోకి
- 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999
- 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.23,999
- అమెజాన్, రియల్ మీ పోర్టళ్లపై లభ్యం
నార్జో 50సిరీస్ లో ఇదే ఖరీదైన ఫోన్. 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, 90హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. మీడియాటెక్ డైమిన్సిటీ 920 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ర్యామ్ ను పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది. వెనుక భాగంలో 48 మెగా పిక్సల్, అల్ట్రావైడ్ సెన్సార్, మ్యాక్సో సెన్సార్ ఇలా మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. పంచ్ హోల్ తో డిస్ ప్లే ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీకి 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది.