ధనుశ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి!

Krithi  in Dhanush movie
  • యూత్ లో కృతి శెట్టికి మంచి క్రేజ్
  • త్వరలో ఆమె నుంచి రానున్న మూడు సినిమాలు 
  • కోలీవుడ్ పై దృష్టి పెట్టిన కృతి శెట్టి 
  • సూర్యతో పాటు ధనుశ్ సినిమాలోనూ ఛాన్స్
కృతి శెట్టి  ..  ఇప్పుడు టాలీవుడ్ లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'ఉప్పెన'తో కుర్రాళ్లపై విరుచుకుపడిన ఈ సుందరి, హ్యాట్రిక్ హిట్ కొట్టేసి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆమె నుంచి మరో మూడు సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. 'మాచర్ల నియోజకవర్గం' .. 'ది వారియర్' సినిమాలు ఉన్నాయి. 

తెలుగులో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, కోలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాలను మాత్రం అమ్మడు వదులుకోవడం లేదు. ఆల్రెడీ బాలా దర్శకత్వంలో రూపొందుతున్న సూర్య సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇక తాజాగా ధనుశ్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. 

ధనుశ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు కృతి శెట్టి పేరు తెరపైకి వచ్చింది. మరి ప్రియాంకతో పాటు కృతి శెట్టిని తీసుకున్నారా? లేదంటే  ప్రియాంకకు బదులుగా  తీసుకున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.
Go Back to Shorts
Dhanush
Krithi Shetty
Priyanka Arul Mohan

More Telugu News