Sharwanand: శర్వానంద్ జోడీగా రాశి ఖన్నా!

  • 'పక్కా కమర్షియల్'తో పలకరించనున్న రాశి ఖన్నా 
  • లైన్లోనే ఉన్న విక్రమ్ కుమార్ 'థ్యాంక్యూ'
  • శర్వానంద్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ 
  • హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వా    
Rashi Khanna in Sharwanand Movie

రాశి ఖన్నా కథానాయికగా మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' రూపొందింది. ఈ సినిమాలో ఆమె గోపీచంద్ సరసన సందడి చేయనుంది. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ జోడీగా 'థ్యాంక్యూ' సినిమాలో అలరించనుంది. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు ముస్తాబవుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ఆమె శర్వానంద్ సరసన కథానాయికగా చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కృష్ణచైతన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన  పాత్రలో ప్రియమణి కనిపించనుందని అంటున్నారు. 

ఈ మధ్యకాలంలో శర్వానంద్ కి హిట్ పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన 'మహా సముద్రం' .. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కూడా నిరాశపరిచాయి.  

More Telugu News