హైదరాబాద్ గచ్చిబౌలిలో స్విగ్గీ డెలివరీ బాయ్ పై రాడ్లు, కర్రలతో 20 మంది హోటల్ సిబ్బంది దాడి
- ఆర్డర్ లేట్ అయిందని అడిగినందుకు దారుణం
- తీవ్రగాయాలపాలైన డెలివరీ బాయ్
- న్యాయం చేయాలంటూ డెలివరీ బాయ్స్ ఆందోళన
ఘటన గురించి తెలిసిన పోలీసులు.. అక్కడకు చేరుకుని ఘర్షణను ఆపారు. తీవ్రంగా గాయపడిన డెలివరీ బాయ్ ను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనతో స్విగ్గీ డెలివరీ బాయ్స్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.