Esha Singh: కేసీఆర్ స‌ర్కారుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన షూట‌ర్ ఈషా సింగ్‌

  • నిఖ‌త్‌, ఈషాల‌కు రూ.2 కోట్ల చొప్పున ప్ర‌క‌టించిన కేసీఆర్‌
  • ఇంటి స్థ‌లాన్ని కూడా కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • ఈ ప్ర‌క‌ట‌న‌పై హ‌ర్షం వ్య‌క్తం చేసిన ఈషా సింగ్‌
esha singh thanked telangana government

ఇటీవ‌లే అటు బాక్సింగ్‌లో నిఖ‌త్ జ‌రీన్‌, ఇటు షూటింగ్‌లో ఈషా సింగ్ స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌కు చెందిన ఈ ఇద్ద‌రు మ‌హిళా క్రీడాకారిణులు త‌మ సత్తాతో రాష్ట్రానికి కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఇనుమ‌డింప‌జేశారంటూ ప్ర‌శంస‌లు కురిపించిన కేసీఆర్ స‌ర్కారు వారిద్ద‌రికీ చెరో రూ.2 కోట్ల న‌గ‌దు పుర‌స్కారం, ఇంటి స్థ‌లం కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చినంత‌నే ఈషా సింగ్ ఉబ్బిత‌బ్బిబ్బు అయ్యింది. త‌న‌కు న‌గ‌దు ప్రోత్సాహ‌కాన్ని ప్ర‌క‌టించిన తెలంగాణ స‌ర్కారు, సీఎం కేసీఆర్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ మేర‌కు బుధ‌వారం రాత్రి ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. త‌మ‌కు ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ట్వీట్‌ను ఆమె త‌న ట్వీట్‌కు జ‌త చేసింది.

More Telugu News