చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్
- నేడు దాసరి నారాయణరావు వర్ధంతి
- వర్ధంతి సభకు హాజరైన సుమన్
- మేకర్స్ వల్ల బయ్యర్లు సంతోషంగా ఉండడంలేదని విమర్శలు
- గతంలో దాసరి బయ్యర్లను ఆదుకున్నారని వెల్లడి
ఇప్పటి రోజుల్లో కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారని వెల్లడించారు. ఆ సినిమాపై నమ్మకంతో కొనుగోలు చేసే బయ్యర్లు, సినిమా ఫ్లాప్ అయితే తీవ్రంగా నష్టపోతున్నారని సుమన్ వివరించారు. సినిమా రిలీజయ్యాక బయ్యర్ల పరిస్థితి గురించి ఆలోచించేవాళ్లే లేరని అన్నారు.
అప్పట్లో దాసరి నారాయణరావు గారు బయ్యర్ల గురించి ఆలోచించేవారని, ఒక సినిమా పోతే, ఆ తర్వాత సినిమాను ఉచితంగా చేసి బయ్యర్లను ఆదుకునేవారని సుమన్ తెలిపారు. ఇప్పుడా పరిస్థితి లేదని, మేకర్స్ కారణంగానే బయ్యర్లు సంతోషంగా ఉండడంలేదని పేర్కొన్నారు.