Malla Reddy: రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ...వీడియో ఇదిగో!

Protesters fires on minister Malla Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఏమాత్రం ఊహించని రీతిలో నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్డి సింహగర్జన సభకు మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగిస్తుండగా, కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు ఏమాత్రం శాంతించకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు. 

అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. దాంతో పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు. కాగా, నిరసనకారులు రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో నినాదాలు చేశారు.
Go Back to Shorts
Malla Reddy
Protests
Reddy Simha Garjana
Ghatkesar
Hyderabad

More Telugu News