పోడు భూముల్లో హరిత హారం నిలిపేయండి: కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
- పోడు భూముల పట్టాల కోసం 3.5 లక్షల మంది దరఖాస్తు
- తక్షణమే వారికి పట్టాలు ఇవ్వాలి
- ఇతరత్రా భూములను వదిలేసి పోడు భూముల్లోనే హరిత హారం ఎందుకు?
- ఇది గిరిజనులను నయవంచనకు గురి చేయడమేనన్న సంజయ్
హరిత హారం కార్యక్రమానికి తాము వ్యతిరేకం కాదని చెప్పిన బండి సంజయ్.. ఇతరత్రా భూములను వదిలేసి కేవలం పోడు భూముల్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న దాదాపు 3.5 లక్షల మంది గిరిజన రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.