KCR: బెంగళూరుకు బయల్దేరిన కేసీఆర్.. షెడ్యూల్ ఇదే

KCR leaves to Bengaluru
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బెంగళూరు పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పయనమయ్యారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో ఆయన భేటీ కానున్నారు. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. సీఎం భద్రతా సిబ్బంది ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన అభిమానులు బెంగళూరులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

కేసీఆర్ బెంగళూరు పర్యటన షెడ్యూల్ వివరాలు:

ఉదయం 9.45 గంటలకు - ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు పయనం
10 గంటలకు - బేగంపేట నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానంలో పయనం
11 గంటలకు - బెంగళూరు లోని హాల్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సీఎం
11.15 గంటలకు - లీలా ప్యాలస్ హోటల్ కు 
11.45 గంటలకు - దేవెగౌడ నివాసానికి పయనం
12.30 గంటలకు - దేవెగౌడ నివాసానికి చేరుకోనున్న కేసీఆర్
మధ్యాహ్నం 3.45 గంటలకు - దేవెగౌడ నివాసం నుంచి హాల్ ఎయిర్ పోర్టుకు పయనం
4 గంటలకు - హైదరాబాదుకు తిరుగు పయనం
సాయంత్రం 5.10 గంటలకు - ప్రగతి భవన్ కి చేరుకోనున్న సీఎం.
Go Back to Shorts
KCR
TRS
Bengaluru
Deve Gowda

More Telugu News