చత్వారం బాధితులకు గుడ్‌న్యూస్.. ‘వ్యూటీ’ ఐ డ్రాప్స్‌తో కళ్లద్దాలకు చెక్!

Eye drops for Presbyopia got US FDA  clearance
  • ‘వ్యూటీ’ చుక్కల మందుకు ఎఫ్‌డీఐ అనుమతి
  • చుక్కలు వేసుకున్న 15 నిమిషాలకు కళ్లు క్లియర్
  • చత్వారాన్ని సరిచేసే తొలి చుక్కల మందుగా వ్యూటీ రికార్డు
చత్వారంతో కళ్లు కనిపించక ఇబ్బందులు పడుతున్న వారి కోసం సరికొత్త ఔషధం వచ్చేసింది. చుక్కల మందు రూపంలో అందుబాటులోకి వచ్చిన దీనిని కంటిలో వేసుకున్న 15 నిమిషాలకే కళ్లలో మసకపోయి కంప్యూటర్, ఫోన్ తెరలను స్పష్టంగా చూడగలుగుతారు. అలాగే పుస్తకాలు, పేపర్లను ఎంచక్కా చదువుకోగలుగుతారు.

నిజానికి 40 ఏళ్లు వచ్చాక చాలామందిలో చత్వారం (ప్రెస్బయోపియా) వస్తుంది. ఇదొచ్చిన వారు కళ్లజోడు అవసరం లేకుండా పుస్తకాలు చదవలేరు. దీంతో ఇలాంటి వారి కోసం ‘వ్యూటీ’ చుక్కల మందు అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చింది. కన్ను పనిచేసే తీరును బట్టి ఈ చుక్కల మందు పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఎఫ్‌డీఐ అనుమతితో చత్వారాన్ని సరిచేసే తొలి చుక్కల మందుగా ‘వ్యూటీ’ రికార్డులకెక్కింది.
Go Back to Shorts
Vuity Eye Drops
America
FDA
Eyes
Presbyopia

More Telugu News