వైసీపీ రాజకీయ కుతంత్రాలతో ఏపీ ప్రజలకు ఇబ్బందులు: జీవీఎల్ నరసింహారావు
- పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనపై జీవీఎల్ ట్వీట్
- ఏపీలో ఏప్రిల్, మే నేలల ఉచిత బియ్యం ఇవ్వలేదని ఆరోపణ
- నిధులు విడుదల చేయడం లేదని కేంద్రంపై వైసీపీ నిందలు
- వైసీపీవి రాజకీయ కుతంత్రాలన్న జీవీఎల్
ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఇప్పటివరకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జీవీఎల్ ఆరోపించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఈ బియ్యానికి సంబంధించిన నిధులను కేంద్రం ఇంకా విడుదల చేయలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వైసీపీ ప్రభుత్వ పెద్దలపై అసహనం వ్యక్తం చేశారు.