మహేశ్ నో చెప్పిందీ అందుకే .. విజయ్ ఎస్ చెప్పిందీ అందుకేనట!
- షూటింగు దశలో వంశీ పైడిపల్లి మూవీ
- విజయ్ కి కెరియర్ పరంగా ఇది 66వ సినిమా
- ఆయనతో ద్విపాత్రాభినయం చేయిస్తున్న వంశీ పైడిపల్లి
- ముందుగా ఇది మహేశ్ కి చెప్పిన కథ అంటూ టాక్
ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది తాజా సమాచారం. ఈ కథను వంశీ పైడిపల్లి ముందుగా మహేశ్ బాబుకి వినిపించాడు. ద్విపాత్రాభినయాలు చేయదలచుకోలేదని ఒక సందర్భంలో మహేశ్ చెప్పాడు. అందువలన ఈ కథను ఆయన సున్నితంగా తిరస్కరించాడు. దాంతో ఆ కథను విజయ్ కి వినిపించాడు వంశీ పైడిపల్లి.
ద్విపాత్రాభినయం పట్ల గల ఆసక్తితోనే విజయ్ ఈ సినిమా చేయడానికి వెంటనే అంగీకరించాడట. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఒక కథానాయికగా అయితే రష్మికను తీసుకున్నారు. మరో కథానాయికకి ఛాన్స్ ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.