మరో ఆఫర్‌తో ముందుకొచ్చిన జియో.. జియో ఫోన్ నెక్స్ట్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్

JioPhone Next available at discounted price but only for limited period
షార్ట్స్‌లో చూడండి
రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. గతేడాది అక్టోబరులో విడుదల చేసిన జియో ఫోన్ నెక్స్ట్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 6,499 కాగా, ఏదైనా 4జీ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 2 వేల తగ్గింపుతో జియో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశంలోని అందరికీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయాలన్న లక్ష్యంతో జియో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ 4జీకి సపోర్ట్ చేస్తుంది.

5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ఉన్న ఈ ఫోన్‌లో మెమరీని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎం ప్రాసెసర్, 13 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. డ్యూయల్ సిమ్ కలిగిన ఈ ఫోన్ ‘ప్రగతి ఓఎస్’పై పనిచేస్తుంది. 

ఈ ఫోన్‌ను తొలుత రూ. 1,999 చెల్లించి వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 18/24 నెలల్లో సులభ వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. డిస్కౌంట్ ఆఫర్‌కు కూడా ఇన్‌స్టాల్‌మెంట్ వర్తిస్తుందని జియో పేర్కొంది.
Go Back to Shorts
Reliance
Jio
JioPhone Next
Offer

More Telugu News