BJP: 26న హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ... ఐఎస్‌బీ వార్షికోత్స‌వానికి హాజ‌రు

pm modi tour in  hyderabad on 26th of this month
షార్ట్స్‌లో చూడండి
భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ నెల 26న తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ రానున్నారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్స‌వంలో ఆయ‌న పాలుపంచుకోనున్నారు. అంతేకాకుండా రామ‌గుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల క‌ర్మాగారాన్ని కూడా ఆయ‌న హైద‌రాబాద్ నుంచే వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించే అవ‌కాశాలున్నాయి.

ఇక పార్టీ ప‌రంగా కూడా మోదీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకునే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం. బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన కీల‌క నేత‌ల‌తో మోదీ ప్ర‌త్యేకంగా భేటీ అవుతారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికే దిశగా బీజేపీ తెలంగాణ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 
Go Back to Shorts
BJP
Prime Minister
Narendra Modi
Hyderabad
ISB
Telangana BJP

More Telugu News