Andhra Pradesh: విద్యుత్ వినియోగం తెలుసుకునేందుకే సాగు మోటార్ల‌కు మీట‌ర్లు: మంత్రి పెద్దిరెడ్డి

ap minister peddireddy reviews power consumption
షార్ట్స్‌లో చూడండి
వ్య‌వ‌సాయ రంగానికి ఎంత‌మేర విద్యుత్ వినియోగం అవుతుంద‌న్న విష‌యాన్ని తెలుసుకునేందుకే సాగు మోటార్ల‌కు మీట‌ర్ల‌ను బిగిస్తున్నామ‌ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసి సాగు మోటార్ల‌కు మీటర్ల బిగింపుపై విప‌క్ష టీడీపీ దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం విద్యుత్ శాఖ‌పై స‌మీక్ష‌లో భాగంగా పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

విద్యుత్ చౌర్యం, అక్ర‌మాల‌ను అరిక‌ట్టేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఈ సంద‌ర్భంగా ట్రాన్స్‌కో అధికారుల‌కు పెద్దిరెడ్డి సూచించారు. అప్ర‌మ‌త్త‌త‌లోనే విద్యుత్ చౌర్యం, దుర్వినియోగం, న‌ష్టాల‌ను నియంత్రించ‌గ‌ల‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక విద్యుత్ వినియోగంపైనా త‌నిఖీలు చేప‌ట్టాల‌ని, త‌నిఖీల ప్ర‌క్రియ నిరంత‌రంగా కొన‌సాగేలా చూడాలంటూ మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Peddireddi Ramachandra Reddy

More Telugu News