ప్రధాని నరేంద్ర మోదీ 'అచ్చే దిన్'పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రం
- మోదీ అచ్చే దిన్ పిలుపునకు 8 ఏళ్లు
- ఈ 8 ఏళ్లలో ఏం సాధించారో చెబుతూ కేటీఆర్ ట్వీట్
- గ్యాస్ ధరలు ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అధికమని వ్యాఖ్య
ఈ 8 ఏళ్లలో రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరిందన్న కేటీఆర్...45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం దాపురించిందని పేర్కొన్నారు. ఇక 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరిందని, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధరలు దేశంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. 42 ఏళ్లలో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ దిగజారిందని కేటీఆర్ పేర్కొన్నారు.