మీడియా ప్రతినిధికి వైసీపీ ఎమ్మెల్యే అవంతి బెదిరింపు!
- కోరాడలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం
- ఏం పని చేస్తున్నావయ్యా అంటూ ఎస్సైపై అవంతి అసహనం
- సోషల్ మీడియాలో సదరు ఘటన వీడియో వైరల్
ఈ ఘటన వివరాల్లోకి వెళితే... భీమిలి పరిధిలోని పద్మనాభం మండలం కోరాడలో సోమవారం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా హాజరైన అవంతి... మీడియా ప్రతినిధులతో పాటు పోలీసు సిబ్బందిపైనా అసహనం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైని పట్టుకుని ఏం పని చేస్తున్నావయ్యా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన ఓ మీడియా ప్రతినిధిని ఆయన బెదిరించారు.