ఫామ్ కోల్పోయినా.. రోహిత్, కోహ్లీకి మద్దతు ప్రకటించిన గంగూలీ
- వారి ఫామ్ పై నాకు ఆందోళన లేదు
- వారు చక్కని ఆటగాళ్లు
- తిరిగి సత్తా చాటుతారన్న బీసీసీఐ అధ్యక్షుడు
‘‘రోహిత్ లేదా విరాట్ ఫామ్ గురించి నేను ఆందోళన చెందడం లేదు. వారు ఎంతో చక్కని ప్లేయర్లు. అంతేకాదు పెద్ద ఆటగాళ్లు కూడా. ప్రపంచ కప్పు చాలా దూరంలో ఉంది. టోర్నమెంట్ ఆరంభానికి ముందే వారు తిరిగి సత్తా చూపించే స్థాయికి చేరుకుంటారు’’ అని ఓ వార్తా సంస్థతో గంగూలీ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ లో భారత్ జట్టు నాలుగు టీ20 మ్యాచ్ లలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో వరుస వెంట టోర్నమెంట్ లు ఆడనుంది.