రాజకీయ విశ్లేషకుడు నరసింహారావు కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
- హైదరాబాద్‌లోని నరసింహారావు ఇంటికి వెళ్లిన చంద్రబాబు
- నరసింహారావు చిత్రపటానికి నివాళి
- నరసింహారావు భార్య, కుమారుడికి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసింహారావు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆయన అనారోగ్యం విషమించడంతో వైద్యులు అత్యవసర చికిత్సకు యత్నించారు. అయినా ఫలితం లేక నరసింహారావు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.