IPL 2022: నేటి డ‌బుల్ హెడ‌ర్‌ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

chennai wins toss and elect to bat first
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో నేడు డ‌బుల్ హెడ‌ర్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టాస్ గెలిచిన చెన్నై జ‌ట్టు ఫ‌స్ట్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కాసేప‌టి క్రితం ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభ‌మైంది. చెన్నై ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్‌, డేవాన్ కాన్వే ప్రారంభించారు. 

ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్లే ఆఫ్స్ నుంచి వైదొల‌గిన చెన్నై జ‌ట్టుకు ఈ మ్యాచ్ విజ‌యావ‌కాశాలతో ప‌ట్టింపేమీ లేదు. మ్యాచ్‌లో విజ‌యం వ‌స్తే ఆ జ‌ట్టుకు ద‌క్కే లాభం ఏమీ లేదు. అలాగ‌ని ఓడితే కొత్త‌గా జ‌రిగే న‌ష్ట‌మూ లేదు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖ‌రారు చేసుకున్న ఒకే ఒక్క జ‌ట్టుగా గుజరాత్ ప‌టిష్ట‌మైన స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో ఆ జ‌ట్టు మ‌రింత ప‌టిష్ట స్థితిలో క‌నిపించ‌నుంది.
Go Back to Shorts
IPL 2022
Chennai Super Kings
Gujarat Titans]

More Telugu News