పెళ్లి వేడుక‌లో స‌రిగ్గా జీల‌కర్ర, బెల్లం పెట్టే స‌మ‌యంలో కుప్ప‌కూలిన వ‌ధువు.. మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి వేడుక‌లో స‌రిగ్గా జీల‌కర్ర, బెల్లం పెట్టే స‌మ‌యంలో కుప్ప‌కూలిన వ‌ధువు.. మృతి

bride dies in vizag
  • విశాఖలోని మధురవాడలో ఘ‌ట‌న 
  • స్పృహ కోల్పోవ‌డంతో ఆందోళ‌న చెందిన కుటుంబ స‌భ్యులు
  • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన పెళ్లికూతురు
ఓ పెళ్లి వేడుక‌లో అంద‌రూ సంతోషంగా గ‌డుపుతుండ‌గా, కాసేప‌ట్లో వివాహ తంతు ముగుస్తుంద‌న‌గా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి వివాహ వేడుక‌లో సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో పెళ్లి కూతురు కుప్పకూలిపోయింది. ఆమె స్పృహ కోల్పోవ‌డంతో ఆందోళ‌న చెందిన కుటుంబ స‌భ్యులు ఆమెను వెంట‌నే ఆసుప‌త్రికి తరలించారు. 

ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం పెళ్లికూతురు సృజన ప్రాణాలు కోల్పోయింది. విశాఖలోని మధురవాడలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహ వేడుక‌ల‌తో ఎంతో సంతోషంగా గ‌డ‌పాల్సిన‌ వ‌ధూవ‌రుల ఇళ్ల‌లో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం అంద‌రినీ క‌ల‌చివేస్తోంది.
bride
Vizag

More Telugu News