ఈ కేటాయింపులు వైసీపీ వాళ్ల కమీషన్లకే సరిపోవు: జనసేన నేత నాదెండ్ల మనోహర్
- పల్లెల్లో రోడ్లకు రూ.300 కోట్లు కావాలన్న నాదెండ్ల
- కానీ ప్రభుత్వం కేటాయించింది రూ.26.6 కోట్లేనాని వెల్లడి
- రోడ్లు వేయలేని వాళ్లా రాజధానులు కట్టేది అన్న నాదెండ్ల
ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. పల్లెలకు రోడ్లు వేయాలంటే రూ.300 కోట్లు కావాలన్న నాదెండ్ల.. ప్రభుత్వం ఇచ్చింది మాత్రం రూ.26.6 కోట్లేనన్నారు. రహదారుల మరమ్మతులకు రూ.100 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం కేటాయించింది రూ.9 కోట్లేనని ఆయన తెలిపారు. ఈ కేటాయింపులు వైసీపీ వాళ్ల కమీషన్లకే సరిపోవన్న నాదెండ్ల.. ఇంకేం రోడ్లు వేస్తారంటూ ఎద్దేవా చేశారు. రోడ్డు వేయలేని వాళ్లా రాజధానులు కట్టేది? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.