దావూద్ అనుచరులు, హవాలా ఆపరేటర్లపై ఎన్ఐఏ సోదాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దావూద్ అనుచరులు, హవాలా ఆపరేటర్లపై ఎన్ఐఏ సోదాలు!

NIA raids on Dawood followers in Mumbai
  • ముంబైలో 12 చోట్ల జరుగుతున్న సోదాలు
  • గత ఫిబ్రవరిలోనే కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ
  • దావూద్ అసోసియేట్స్ పై ఎప్పటి నుంచో ఆరోపణలు
ముంబైలో ఎన్ఐఏ అధికారులు పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులైన డ్రగ్స్ సరఫరాదారులు, హవాలా ఆపరేటర్లపై రెయిడ్స్ జరుపుతున్నారు. మొత్తం 12 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. శాంతాక్రజ్, భెండీ బజార్, ముంద్రా, బోరివలి, పరేల్, నాగ్ పడగా ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. 

వాస్తవానికి గత ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. యూఏపీఏ కేసుకు సంబంధించి దావూద్ అసోసియేట్స్ పై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు డ్రగ్స్ సరఫరాదారులు, రియలెస్టేట్ వ్యాపారులపై కూడా ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే దావూద్ అనుచరులపై సోదాలు నిర్వహిస్తోంది. దావూద్ అనుచరుల్లో పలువురు విదేశాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
Mumbai
NIA Raids
Dawood

More Telugu News