Atchannaidu: రైతుల‌ను ఆదుకోవాలంటూ ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అచ్చెన్నాయుడు లేఖ

atchennaidu slams ycp
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఏపీలో ఇటీవ‌ల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయ‌న కోరారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్ల ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు హామీలు ఏమ‌య్యాయ‌ని ఆయ‌న నిల‌దీశారు. మూడేళ్లలో వ‌ర్షాలకు దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన‌ పంట నష్టం జ‌రిగింద‌ని, అయితే, ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 10 శాతం కూడా దాటలేదని ఆయ‌న అన్నారు. 

నష్టపోయిన రైతులకు పరిహారం అందించాల‌ని ఆయ‌న అన్నారు. వ‌ర్షాల‌కు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా రాష్ట్ర స‌ర్కారు చర్యలు తీసుకోవాలని ఆయ‌న కోరారు. ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయార‌ని, వారిని అకాల వర్షాలు మరిన్ని ఇబ్బందుల‌కు గురిచేశాయని అన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. 
Go Back to Shorts
Atchannaidu
Telugudesam
YSRCP

More Telugu News