శంషాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన టీపీసీసీ నేత‌లు

rahul reaches shamshabad airport
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న ప్రారంభమైపోయింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన ఆయ‌న‌ సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్ ప‌రిధిలోని శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం చేరుకున్నారు. అక్కడ ఆయనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క స‌హా ప‌లువురు సీనియ‌ర్ నేతలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

మ‌రికాసేప‌ట్లో శంషాబాద్ నుంచే హెలికాప్ట‌ర్‌లో రాహుల్ గాంధీ వ‌రంగ‌ల్ చేరుకుంటారు. వ‌రంగ‌ల్‌లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌కు హాజ‌ర‌వుతారు. ఈ స‌భ ముగిసిన అనంత‌రం రాత్రికి తిరిగి ఆయ‌న హైద‌రాబాద్ చేరుకుంటారు. రాత్రి హైద‌రాబాద్‌లోనే బ‌స చేయ‌నున్న రాహుల్ గాంధీ.. శ‌నివారం నాడు పార్టీ కీల‌క నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం కానున్నారు.
Go Back to Shorts
Congress
Rahul Gandhi
TPCC
Revanth Reddy
Mallu Bhatti Vikramarka
warangal

More Telugu News