KCR: ఆత్మీయుడిని కోల్పోయా!... బొజ్జ‌ల మృతిపై కేసీఆర్ సంతాపం!

kcr condolences bojjala demise
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి మృతిపై రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్... బొజ్జ‌ల మృతికి సంతాపం తెలుపుతూ కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. స‌హచ‌రుడు, ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. బొజ్జ‌ల కుటుంబ స‌భ్యుల‌కు ఆయ‌న త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌తో కేసీఆర్ అత్యంత స‌న్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేత‌ల్లో బొజ్జ‌ల కూడా ఒక‌రు. ఈ కార‌ణంగానే బొజ్జ‌ల మృతి వార్త తెలిసినంత‌నే త‌న ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు.
Go Back to Shorts
KCR
TRS
TDP
Bojjala Gopala Krishna Reddy

More Telugu News