Narendra Modi: జర్మనీలో మోదీ.. వైరల్ గా మారిన 30 ఏళ్ల నాటి ఫొటో!

  • 1993లో జర్మనీకి వెళ్లిన మోదీ
  • అప్పట్లో ఫ్రాంక్ ఫర్ట్ లో దిగిన ఫొటో ఇప్పుడు తెరపైకి వచ్చిన వైనం
  • అప్పుడు ఆయన బీజేపీ సాధారణ నేత మాత్రమే
PM Modis 30 year old photo in Germany goes viral

భారత ప్రధాని మోదీ ప్రస్తుతం యూరప్ దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు ఉక్రెయిన్-రష్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో మోదీ పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది. ఆదివారం జర్మనీలో పర్యటించిన మోదీ... అక్కడి నుంచి డెన్మార్క్ కు వెళ్లారు.

అయితే ఆయన జర్మనీకి వెళ్లిన సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో 1993లో మోదీ ఈ ఫొటో దిగారు. ఫొటోలో ఆయనతో పాటు ఆయన సహచరుడు కూడా ఉన్నారు. 

ఈ ఫొటో దిగినప్పుడు ఆయన కేవలం బీజేపీ సాధారణ నాయకుడు మాత్రమే. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగి... ఇప్పుడు దేశ ప్రధాని హోదాలో జర్మనీకి వెళ్లారు.

More Telugu News