KTR: రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన... షెడ్యూల్ ఇదిగో!

KTR will visit Sirsilla district
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్ రేపు అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సిద్ధిపేట రెడ్డి ఫంక్షన్ లో ఉదయం 11 గంటలకు అంకిరెడ్డిపల్లె సర్పంచ్ గోపాల్ రెడ్డి కుమారుడి వివాహం జరగనుండగా, ఈ పెళ్లికి కేటీఆర్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెస్ చైర్మన్ పదవీప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. 

అనంతరం, మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో ఎల్లమ్మ సిద్ధోగం (కల్యాణమహోత్సవం) వేడుకలకు వెళతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్లారెడ్డిపేట మండలం వదిరకు చెందిన దళితబంధు లబ్దిదారులు దళితబంధు పథకంలో భాగంగా అక్కపల్లి స్టేజ్ వద్ద నిర్మించుకుంటున్న రైస్ మిల్లుకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 

మధ్యాహ్నం 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేట సాయిమణికంఠ గార్డెన్ లో రాజన్నపేట సర్పంచ్ శంకర్ సోదరుడి వివాహానికి హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Go Back to Shorts
KTR
Sirsilla
Visit
TRS

More Telugu News