'సర్కారువారి పాట' నుంచి ట్రైలర్ రిలీజ్!

Sarkaru Vaari Paata movie update
  • మహేశ్ హీరోగా రూపొందిన 'సర్కారువారి  పాట'
  • పాటల పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న సినిమా 
  • యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచే అవకాశాలు  
  • ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల 
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీ నేపథ్యంలో సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు బాడీ లాంగ్వేజ్ కి తగిన డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'అప్పుడే మీకు పెళ్లేంటి సార్' అని వెన్నెల కిశోర్ అంటే, 'అందరూ నీలాగే అనుకుంటున్నారయ్యా .. దీనమ్మా మెయింటెయిన్ చేయలేక దూల తీరిపోతోంది' అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ పేలింది.

మహేశ్ - కీర్తి మధ్య  లవ్ ట్రాక్  .. మహేశ్ - వెన్నెల కిశోర్ మధ్య కామెడీ ట్రాక్ .. మహేశ్ - సముద్రఖని మధ్య సవాల్ సీన్స్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది. నదియా కీలకమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో,  పోసాని .. తనికెళ్ల భరణి .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Keerthi Suresh
Sarkaruvari paata Movie

More Telugu News