జర్మనీలో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో
- బెర్లిన్ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం
- ప్రవాస భారతీయులతో మాట్లాడిన ప్రధాని
- కాసేపట్లో జర్మనీ ఛాన్సలర్ తో భేటీ
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోన్న నేపథ్యంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతుండగా భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తోన్న నేపథ్యంలో ఐరోపాలో మోదీ పర్యటిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఐరోపా దేశాలు ఇంధన సమస్యలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ఈ సమస్యపైనే ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు కాసేపట్లో బెర్లిన్ లో భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశంలో మోదీ పాల్గొంటారు.