వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో కూర్చొని టిఫిన్ తిన్న వ్యక్తి.. వీడియో వైరల్
- బెంగళూరులోని బసవేశ్వర నగర్లో ఘటన
- దోశ, వాటర్ తెచ్చుకుని రోడ్డుపై కూర్చొని తిన్న వైనం
- వాహనాలు పక్క నుంచి వెళ్లాలని సూచించిన తాగుబోతు
ఆ సమయంలో ఆ వ్యక్తి మద్యం తాగి ఉన్నాడు. దోశ, వాటర్ బాటిల్ తో రోడ్డు మధ్యలో కూర్చుని, చాలా సేపు దోశ తిన్నాడు. వాహనాలు పక్క నుంచి వెళ్లాలని, టిఫిన్ తింటోన్న సమయంలో తనను డిస్టర్బ్ చేయకూడదని అతడు వాహనదారులకు సూచించాడు.