చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి యువకుడిని కొట్టిన వైనం.. వీడియో ఇదిగో
- ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
- ఓ ఇంట్లో చొరబడడానికి యత్నించిన యువకుడు?
- అందుకే మరుసటి రోజు పట్టుకుని కొట్టిన వైనం
గ్రామంలోని ఒకరి ఇంట్లో మొన్న రాత్రి సమయంలో చొరబడడానికి మహవీర్ సూర్యవంశీ అనే యువకుడు ప్రయత్నించడంతో అతడిని పట్టుకోవడానికి స్థానికులు యత్నించారని తెలిసింది. అయితే, సూర్యవంశీ తప్పించుకుని పారిపోవడంతో అతడిని నిన్న ఉదయం పట్టుకుని చెట్టుకి తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.