కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందన ఇదే
- తెలంగాణ ప్రజలను ఏపీకి కాకుండా యూపీకి పంపండి
- డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తారు
- బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోందన్న జీవీఎల్
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా జీవీఎల్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పాలకులు తమ రాష్ట్ర ప్రజలను ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ కు పంపాలని జీవీఎల్ సూచించారు. అవినీతిని,అరాచకాలను డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎలా బుల్డోజింగ్ చేస్తుందో తెలంగాణ ప్రజలు చూస్తారని జీవీఎల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోందన్న జీవీఎల్...తెలంగాణ ప్రజలను ఉత్తరప్రదేశ్ పంపే ధైర్యం ఉందా?అంటూ కేటీఆర్‌కు జీవీఎల్ సవాల్ విసిరారు.