టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక‌ల వేళ కేసీఆర్ అరుదైన ఫొటో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక‌ల వేళ కేసీఆర్ అరుదైన ఫొటో

kcr rare photo in twitter
  • బ‌నియ‌న్‌లో క‌నిపిస్తున్న కేసీఆర్‌
  • ఆంగ్ల దిన పత్రిక ప‌ఠ‌నంలో లీన‌మైన వైనం
  • ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన టీఆర్ఎస్ నేత‌
తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా సాధించుకోవా‌ల‌నే సింగిల్ ఎజెండాతో ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) తాను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించుకుంది. ఉద్య‌మం ఫ‌లితంగా ఏర్పాటైన తెలంగాణ‌లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వ‌రుస‌గా రెండో ప్ర‌భుత్వాన్ని కూడా ఆ పార్టీనే ఏర్పాటు చేసింది. బుధ‌వారం నాడు ఆ పార్టీ త‌న 21వ ఆవిర్భావ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ప్లీన‌రీని నిర్వ‌హించుకుంటోంది.

ఈ వేడుక‌లు హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో వేడుక‌గా జ‌రుగుతుండ‌గా... సోష‌ల్ మీడియాలో టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌కు చెందిన ఓ అరుదైన ఫొటో ప్ర‌త్య‌క్ష‌మైంది. బ‌నియ‌న్ వేసుకుని మంచంపై కూర్చుని ఆంగ్ల దిన‌ప‌త్రిక 'ద హిందూ' పేప‌ర్‌ను చేతుల‌తో ప‌ట్టుకుని ఆస‌క్తిగా చ‌దువుతున్న కేసీఆర్ ఫొటోను టీఆర్ఎస్‌కు చెందిన ఓ నేత ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ సాధ‌న‌కు కేసీఆర్ చేసిన కృషిని ఆయ‌న ఆస‌క్తిక‌రంగా వ‌ర్ణించారు.
KCR
TRS
Telangana

More Telugu News