దావూద్ గ్యాంగ్‌తో లింకులు... నవనీత్ కౌర్ దంపతులపై కేసు
- హనుమాన్ ఛాలీసా వివాదంలో అరెస్టయిన నవనీత్ దంపతులు
- దావూద్‌తో నవనీత్ దంపతులకు సంబంధాలపై పోలీసులకు ఫిర్యాదు
- శివసేన ఎంపీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుకు పోలీసుల రెడీ
దావూద్‌తో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బాలీవుడ్ నిర్మాత యూసుఫ్ లక్డావాలాను ఇప్పటికే ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లక్డావాలా నుంచి నవనీత్ దంపతులు రూ.80 లక్షలను అక్రమంగా వసూలు చేశారన్నది సంజయ్ రౌత్ ఆరోపణ. ఈ ఆరోపణలతోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే హనుమాన్ ఛాలీసా వివాదంలో అరెస్టయిన నవనీత్ దంపతులు.. తాజా కేసు నమోదైతే మరింత మేర ఇబ్బందులకు గురి కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.