రుయా అంబులెన్స్ ల దందాపై జగన్ స్పందన ఇదే
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న జగన్
- ఈ ఘటనలే వ్యవస్థను అప్రతిష్ట పాలు చేస్తాయని వ్యాఖ్య
- ఇప్పటికే ఘటనపై ప్రభుత్వం చర్యలు
- ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై కేసులు, అరెస్టులు
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన అభిప్రాయపడ్దారు. ఇలాంటి చిన్నఘటనలే మొత్తం వ్యవస్థనే అప్రతిష్ట పాలు చేస్తాయని జగన్ వ్యాఖ్యానించారు.